హైదరాబాద్: టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ త్వరలో గృహిణి కాబోతోంది. బెంగళూరుకు చెందిన గౌతమ్ అనే వ్యాపారవేత్తతో కాజల్‌కు నిశ్చితార్థమైందని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారన్న టాక్ టాలీవుడ్లో ప్రముఖ వార్త అయింది.
ఈ సంబంధాన్ని తల్లిదండ్రులే చూశారని, ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ రహస్యంగా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ దాదాపు పుష్కరకాలమైనా ఇంకా ప్రముఖ హీరోయిన్గా కొనసాగుతోంది.
తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పిన కాజల్ ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.