హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

12:39 pm, Wed, 25 September 19

హైదరాబాద్: తెలుగు చిత్రసీమకు చెందని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ ఆరోగ్యం నిన్ననే విషమించింది. దీంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు.

పలు హిట్ చిత్రాల్లో నటించిన వేణు మాధవ్.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించారు. టాలీవుడ్ హాస్యనటుల్లో తనకంటూ.. ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణు మాధవ్.. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సంప్రదాయం’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమాతోమంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానూ రెండుమూడు చిత్రాల్లో నటించారు.