తెలుగు కమెడియన్ వేణుమాధవ్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

7:26 am, Wed, 25 September 19
హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
 
వేణుమాధవ్ గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మూడు నెలలుగా తరుచూ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రెండురోజుల క్రితం యశోద ఆస్పత్రిలో చేర్పించారు.
 
మంగళవారం సాయంత్రానికి పరిస్థితి మరింత విషమించడంతో కృత్రిమ శ్వాస అందించడంతోపాటు డయాలసిస్‌ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వేణుమాధవ్‌ ఆరోగ్యంపై ఆరాతీసేందుకు పలువురు ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి వెళ్లారు.
 
ప్రముఖ నటులు జీవిత, రాజశేఖర్‌ సహా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.