పేద కళాకారుల కోసం వీవీ వినాయక్ రూ. 5 లక్షల విరాళం

8:06 pm, Wed, 25 March 20

హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా షూటింగులు వాయిదా పడడంతో ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులను ఆదుకునేందుకు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముందుకొచ్చారు.

తన వంతు సాయంగా రూ. 5 లక్షలు విరాళం ప్రకటించాడు. ఈ మేరకు కాదంబరి కిరణ్‌కు చెక్కును అందించనున్నట్టు తెలిపారు.

నిత్యావసర సరుకులు అవసరమైన వారు కిరణ్‌ను స్పందించాలని సూచించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అందరం ఇళ్లలోనే ఉండి ఆ మహమ్మారిని వణికించాలని వినాయక్ పేర్కొన్నారు.

షూటింగులు లేకపోవడంతో పరిశ్రమలోని పేద కళాకారులు, ఫైటర్లు, డ్యాన్స్ మాస్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి అందించాలని కోరుతూ కాదంబరి కిరణ్‌కు రూ. 5 లక్షలు ఇస్తున్నానని, అవసరమైన వారు ఆయనను సంప్రదించాలని వినాయక్ కోరారు.