ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడుతోన్న హీరో నిఖిల్.. వివాహ వేడుక షురూ

1:44 am, Thu, 14 May 20
hero-nikhil-siddharth-wedding

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ పెళ్లి వేడుకలు బుధవారం మొదలయ్యాయి. ఆయనది ప్రేమ వివాహం. ఇటీవలే తను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మతో ఆయనకు నిశ్చితార్థం అయింది. 

నిజానికి వీరి వివాహం తొలుత నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా, కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగానే వివాహం చేసుకోబోతున్నట్లు ఇప్పటికే నిఖిల్ ప్రకటించారు.

లాక్‌డౌన్ తరువాత మూఢం రావడం, వధూవరులకు సరైన ముహూర్తాలు లేకపోవడంతో గురువారం (మే 14, 2020) ఉదయం 6:31 గంటలకు వీరి వివాహం చేయాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు.

కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి రావడంతో.. అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. శామీర్‌పేటలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో నిఖిల్-పల్లవిల వివాహం జరగనుంది. 

చదవండి: పవన్ కళ్యాణ్ 28వ చిత్రం.. ఒక హీరోయిన్‌గా మలయాళీ బ్యూటీ మానస!?