బాలీవుడ్‌పైనే దృష్టి.. మరో భారీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన రానా!

2:31 pm, Wed, 20 March 19
rana-daggubati

హైదరాబాద్: రానా ఇప్పుడు తమిళ, హిందీ సినిమాలతో బిజీగా వున్నాడు. హిందీ సినిమాలపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టాడు. అందువలన ఆ వైపు నుంచి ఆయనకి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఆయన ‘హౌస్ ఫుల్ 4’ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు.

తాజాగా హిందీలో రూపొందనున్న మరో భారీ బడ్జెట్ సినిమాలోను ఆయనకి అవకాశం దక్కింది. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రానాను తీసుకున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రానా, కల్నల్ గా కనిపించనున్నాడు.

150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అభిషేక్ దుదానియా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తనకి మరింత క్రేజ్ తీసుకొస్తుందనే నమ్మకంతో రానా వున్నాడు.