‘అర్జున్‌రెడ్డి’ నయా మూవీ షురూ! శ్రీదేవి కూతురి స్థానంలో మరో నటి?

7:13 am, Tue, 21 January 20

ముంబై: పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ మేరకు చార్మి ముహుర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టగా, ఆ ఫొటోలను ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

ఈ మూవీకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉండగా, యాక్షన్‌, ప్రేమ కథాంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ నటి అనన్య పాండేను ఈ మూవీకి ఎంపిక చేసినట్లు తెలిసింది.