హీరోయిన్లు అందరూ తన ప్రియురాళ్లే అని ప్రచారం చేసుకున్న సునిశిత్ అరెస్ట్

- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్లు అందరూ తన ప్రియురాళ్లేనంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్న యువకుడికి హైదరాబాద్ పోలీసులు అరదండాలు వేశారు. 
 
సునిశిత్ అనే యువకుడు సోషల్ మీడియాలో హీరోయిన్లపై ఆరోపణలు గుప్పించడమే కాకుండా తన ప్రియురాళ్లు అంటూ ప్రచారం చేసేవాడు. 
 
సునిశిత్‌పై ఇప్పటికే  ఇబ్రహీంపట్నం, కీసర పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. నటి లావణ్య త్రిపాఠి తన లవరేనంటూ గతంలో అతడు చేసిన ప్రచారంపై నటి తీవ్రంగా స్పందించింది. 
 
అతడిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునిశిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.  
- Advertisement -