బిగ్‌బాస్-4 వ్యాఖ్యాతగా విజయ్ దేవరకొండ.. షికారు చేస్తున్న పుకార్లు

- Advertisement -

హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్ 4 హోస్ట్‌గా ఈసారి ఎవరు రాబోతున్నారనే దానిపై ఇప్పటి వరకు పలువురి పేర్లు బయటకొచ్చి షికారు చేశాయి. ఎన్టీఆర్, నాగార్జున, సమంత అంటూ పలువురి పేర్లు ఇటు సోషల్ మీడియాలోనూ, అటు ప్రధాన మీడియాలోనూ హల్‌చల్ చేశాయి. అయితే, ఇప్పుడు వీరందరినీ కాదని మరో పేరు బయటకు వచ్చింది. అది మరెవరో కాదు.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ.

అయితే, ఈ విషయంలో నిర్వాహకుల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఇది కూడా పుకారుగానే మిగిలిపోనుందా? అనే దానిపై క్లారిటీ లేదు. కాగా, ఇప్పటికే ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4’కు సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు హోస్ట్ విషయంలోనూ ఓ క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. నిర్వాహకులు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుంటే మరెంత మంది పేర్లు బయటకు వస్తాయో చెప్పడం కష్టమే.

- Advertisement -
- Advertisement -