ప్రభాస్‌కు హీరోయిన్ దొరికేసింది.. తెలుగు తెరపైకి దీపిక పదుకొనె

- Advertisement -

హైదరాబాద్: ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఓ సినిమాకు కథనాయిక ఫిక్స్ అయింది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్రనాయికల్లో ఒకరైన దీపిక పదుకునెను కథానాయికగా ఖరారు చేశారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

‘భారతీయ సినిమాలో మా సంస్థ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ సినిమాను సువర్ణావకాశంగా భావిస్తున్నాం. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్‌ అనుభూతిని అందించడానికి దీపిక పదుకునె వంటి అద్భుతమైన నటిని ఎంపిక చేసుకున్నాం’ నిర్మాత అశ్వినీదత్ పేర్కొన్నారు. ‘కింగ్‌కు సరిపోయే క్వీన్‌ కావాలి కదా.. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ట్వీట్ చేశారు.

- Advertisement -

ఈ సినిమాలో భాగమవడం థ్రిల్‌కు మించిన అనుభూతిని కలిగిస్తోందని దీపిక సంతోషం వ్యక్తం చేసింది. మున్ముందు గొప్ప ప్రయాణానికి నాంది ఇది అని పేర్కొంది. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సహనిర్మాతలు స్వప్నాదత్‌, ప్రియాంకాదత్‌ చెప్పారు.

- Advertisement -