వైరల్ అవుతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి వీడియో…

4:06 pm, Thu, 14 May 20
hero-nikhil-and-pallavi-varma-wedding

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఎట్ట‌కేల‌కి త‌న ప్రియురాలు డాక్టర్ ప‌ల్ల‌వి వర్మ‌ని వివాహ‌మాడాడు. గురువారం (ఏప్రిల్ 14, 2020) ఉద‌యం 6.30 గంటలకు నిఖిల్‌, ప‌ల్ల‌విల వివాహం నిరాడంబ‌రంగా జరిగింది.

కొద్ది మంది స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు. నిఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియోలో హల్‌చల్ చేస్తున్నాయి.

చదవండి: ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడుతోన్న హీరో నిఖిల్.. వివాహ వేడుక షురూ

‘పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వీనీ పెండ్లి కూతురు’  అంటూ నిఖిల్‌, పల్ల‌విలు త‌లంబ్రాల‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నిఖిల్‌, ప‌ల్ల‌విల వివాహానికి సంబంధించిన ప్ర‌తి వీడియో ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఏప్రిల్ 16న వీరి వివాహం నిశ్చ‌యించిన్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. ఎట్టకేల‌కి ఈ రోజు ఉద‌యం నిఖిల్, ప‌ల్ల‌విల వివాహం నిరాడంబ‌రంగా జ‌రిగింది.