ఏపీ సీఎం జగన్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు

- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఓ తెలుగు చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

తెలంగాణపై తాను వ్యాఖ్యలు చేయబోనన్న కోట.. ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం తనకు మాట్లాడే అర్హత ఉందన్నారు. తాను అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు సొంతూరులో తనకు ఇంకా ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ రెండు కారణాలతోనే తాను ఏపీ గురించి మాట్లాడుతున్నానని పేర్కొన్న ఆయన.. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ.. నిద్ర నటించే వాడిని లేపలేమంటూ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయని అనుకోవడం లేదన్న కోట.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని అన్నారు.

- Advertisement -