అలనాటి నటి గీతాంజలి కన్నుమూత.. శోకసంద్రంలో టాలీవుడ్

11:35 am, Thu, 31 October 19

హైదరాబాద్: వెండితెరపై సీత గా అలరించిన అలనాటి నటి గీతాంజలి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ఫిల్మ్ నగర్ లోని అపోలో హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.

‘సీతారామ కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన గీతాంజలి.. ఆ తర్వాత చాలా తెలుగు, తమిళ, మళయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో నటించారు. హాస్యనటుడు పద్మనాభంతో కలసి శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఆమె నటించారు.

1957 లో కాకినాడ లో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత గీతాంజలి గా పేరు మార్చుకున్నారు. తోటి నటుడు రామక‌ృష్ణను ఆమె వివాహాం చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో, గోపీ గోపిక గోదావరి, మొగుడు చిత్రాల్లో బామ్మగా ఈ తరం వారికి సుపరిచితం.