దూసుకుపోతున్న మహేశ్.. సంక్రాంతికే ‘సరిలేరు నీకెవ్వరు’

11:18 am, Mon, 9 September 19

హైదరాబాద్: భరత్ అనే నేను, మహర్షి వరస విజయాల తరువాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన కొండారెడ్డి బురుజు సెట్స్‌లో సినిమా షూటింగ్ జరుగుతోంది. సెప్టెంబర్ 13వ తేదీతో షూటింగ్ పూర్తి కానుంది.

నవంబర్ వరకు షూటింగ్ మొత్తం పూర్తి చేసి డిసెంబర్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.