‘నిశ్శబ్దం’ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా ప్రభాస్

11:48 am, Mon, 30 December 19

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు టాలీవుడ్ టాక్. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, కోన వెంకట్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్‌ను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభాస్ ఆహ్వానించనున్నట్టు సమాచారం. ప్రభాస్, అనుష్క మధ్య మంచి స్నేహం ఉండడంతో ప్రభాస్ కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుష్క సినిమా ప్రమోషన్‌కి సంబంధించిన విషయం కావడంతో వచ్చేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.