అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…

6:15 pm, Sat, 6 June 20
Actor Allu Arjun.

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇప్పటి వరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ వస్తున్న ‘బన్నీ’ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతేకాదు,  తన సినిమాల డబ్బింగ్ మలయాళం, హిందీలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.

తాజాగా, అల్లు అర్జున మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. దక్షిణాదిలోనే స్టార్ హీరోలెవరికీ దక్కని ఘనత బన్నీకి దక్కింది.

అదేంటో తెలుసా? బన్నీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాకు లైకుల సంఖ్య 13 మిలియన్లకు చేరింది.  దక్షిణాదిలో మరే హీరోకీ ఈ ఘనత దక్కలేదు.

ఫలితంగా ఈ రికార్డు అందుకున్న తొలి హీరోగా రికార్డులకెక్కాడు. విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ‘కింగ్ ఆఫ్‌ సోషల్ మీడియా’ అంటూ వారు బన్నీని ఆకాశానికెత్తేస్తున్నారు.

చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు మీరా చోప్రా ఫిర్యాదు.. మహిళా కమిషన్ జోక్యం,…