రూటు మార్చిన విజయ్ దేవరకొండ.. వెబ్ సిరీస్‌పై దృష్టి

6:54 pm, Thu, 14 May 20

హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు కూడా డిజిటల్ రంగంపై దృష్టి సారిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన స‌మంత ఇప్పటికే  ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఇప్పుడు ఆమె బాట‌లో ప‌లువురు స్టార్లు ప‌య‌నిస్తున్న‌ారు. యూత్ సెన్సేష‌న‌ల్ హీరో  విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఓ వెబ్ సిరీస్ మొద‌లెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

‘ఆహా’ అనే ఓటీటీకి  బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా  ఉన్న విజ‌య్ దానికి సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్‌లలో పాలుపంచుకోబోతున్నాడు.

విజ‌య్ నిర్మాణ సంస్థ అయిన కింగ్‌ ఆప్ ది హిల్స్ త‌ర‌పున ఒక‌ట్రెండు వెబ్ సిరీస్‌లు ప్ర‌స్తుతం ప్లానింగులో ఉన్నాయి.

అందులో ఓ ప్రాజెక్టుని కేవీఆర్ మ‌హేంద్ర‌కి అప్ప‌జెప్పే అవ‌కాశాలున్నాయి. మ‌హేంద్ర ఇదివ‌ర‌కు విజ‌య్ త‌మ్ముడు ఆనంద్  ప్ర‌ధాన పాత్ర‌లో దొర‌సాని సినిమా తెర‌కెక్కించారు.

ఆ ప‌రిచ‌యం కొద్ది  మ‌హేంద్ర‌కు ఈ వెబ్ సిరీస్ అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.