విజయ్ దేవరకొండ మూవీ ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

5:36 pm, Wed, 8 May 19
Vijay Devarakonda Latest Updates, Dear Comrade Movie News, Tollywood News , Newsxpressonline

హైదరాబాద్: విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రంగా ‘డియర్ కామ్రేడ్’ రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన నటిస్తోంది. మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ క్రికెటర్ గా రష్మిక నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన గీత గోవిందం సంచలన విజయం సాధించడంతో, సహజంగానే ‘డియర్ కామ్రేడ్’పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి మరి, ప్రస్తుతం విజయ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ రికార్డ్స్ ని తుడిచిపెట్టడం సాధ్యమే అని అనుకుంటున్నారు.

చదవండి:  మరోసారి లవ్‌స్టోరీతోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అఖిల్!