మహేశ్ సినిమాలో విజయశాంతి పాత్ర ఇదే….!

3:56 pm, Wed, 5 June 19

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ..తాజాగా నటించిన చిత్రం మహర్షి…మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం మహర్షి సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న మహేశ్…. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే,

ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మందన నటించనుండగా, కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు.

అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయశాంతి…మళ్ళీ 13సంవత్సరాల తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టడంతో…. ఆమె పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమాలో ఊరు బాగుకోసం తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి పట్టిన పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇక మరో కీలకమైన పాత్రను చేస్తోన్న జగపతిబాబుతో ఆమె పాత్ర తలపడనుందని అంటున్నారు. మరి చూడాలి రాములమ్మ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో…

చదవండి: రాశి ఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్