వైరల్ అవుతున్న మన్మధుడు 2 ఫ్యామిలీ గ్రూప్ ఫొటో!

3:08 pm, Tue, 2 April 19
Manmadhudu 2 Latest News, Tollywood Latest Movie News, Newsxpressonline

హైదరాబాద్: కింగ్ అక్కినేని నాగార్జున కెరియర్ లో మరచిపోలేని సినిమా అంటే మన్మధుడు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇదే నా మన్మధుడు 2 బ్యాచ్ అంటూ నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రధాన పాత్రధారుల సెల్ఫీ…

కొన్నేళ్ల క్రితం నాగార్జున, సోనాలీ బింద్రే హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘మన్మధుడు’ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తాజా చిత్రం తెరకెక్కుతోంది. ఇక సినిమాలోని ప్రధాన పాత్రధారులంతా కలిసి ఓ సెల్ఫీ ఫొటోను తీసుకున్నారు.

దీన్ని నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాగార్జున‌తో పాటు హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల కిషోర్, దర్శకుడు రాహుల్‌ రవీంద్ర, రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, దేవదర్శిణి, చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.