వైఎస్సార్ ఎప్పుడు మృతి చెందారు?.. ఎంతమందికో రేషన్ షాపు ఉంది?.. గ్రూప్-2 పేపర్‌‌లో ప్రశ్నలివే!

- Advertisement -

అమరావతి: గ్రూప్-2 పోస్టుల కోసం ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్ష పత్రంలోని ప్రశ్నలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేశాయి. గురువారం పేపర్- పరీక్ష నిర్వహించిన అధికారులు, శుక్రవారం పేపర్-2, పేపర్-3 పరీక్షలు నిర్వహించారు. అయితే, ఇందులో అడిగిన ప్రశ్నలు అభ్యర్థులను తికమకపెట్టాయి.

 

గ్రూప్-2 స్థాయికి తగినట్టుగా ప్రశ్నలు లేవని అభ్యర్థులు పేర్కొన్నారు. మైనస్ మార్కులున్నా 130 మార్కులు వచ్చేలా ప్రశ్నలు రూపొందించారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడు చనిపోయారు? రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? ఏపీలో ఎంతమందికో రేషన్ దుకాణం ఉంది? వైఎస్ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలు ఏవి? వంటి ప్రశ్నలు అడిగారు.

 

అయితే.. ఏపీ, ఇండియన్ ఎకానమీపై మూడో పేపర్‌లో అడిగిన ప్రశ్నలు మాత్రం కొంత కఠినంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు. బ్యాంకులు, జీడీపీపై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. నిజానికి ఏపీ, ఇండియన్‌ ఎకానమీకి సంబంధించి సమపాళ్లలో ప్రశ్నలు అడగాల్సి ఉండగా, ఇండియన్‌ ఎకానమీపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

 

కొన్ని ప్రశ్నలు అభ్యర్థుల స్థాయికి మించి ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, గ్రూప్-2 పరీక్షకు 5,770 మంది అంటే 94.49 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.

- Advertisement -