యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ 20వ సినిమా రిలీజ్ అప్పుడేనట!

12:35 pm, Fri, 28 February 20

హైదరాబాద్: యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం `జిల్` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ సినిమాను చేస్తున్నసంగతి తెలిసిందే. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

`బాహుబ‌లి`, `సాహో` చిత్రాల త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్నఈ సినిమాను తెలుగు, తమిళ‌, హిందీల్లో విడుద‌ల చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 16న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే నిర్మాత‌లు బ‌య్య‌ర్స్‌తో మాట్లాడి రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ ఇస్తార‌ట‌.

`ఓ మైడియ‌ర్‌`, `రాధే శ్యామ్` అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.