33 మంది జూదగాళ్లు.. మూడేళ్ల క్రితం కేసు.. 23 మంది పోలీసులకు నజరానా

11:32 pm, Fri, 12 June 20

మూడేళ్ల క్రితం కేసులో పనిచేసిన పోలీసులకు ఇప్పుడు భారీ నజరానా ఇవ్వనున్నారు.

2017లో కేరళ రాష్ట్రంలో ఓ పెద్ద జూదగాళ్ల ముఠాను స్థానిక పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. 

అందుకుగానూ 23 పోలీసులను కేరళ ప్రభుత్వం సత్కరించనుంది. గుట్టు చప్పుడు కాకుండా జూద కార్యకలాపాలను నిర్వహిస్తున్న 33మంది జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారితో పాటు రూ.18లక్షల నగదునూ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలో ఆ ఆపరేషన్‌లో పనిచేసిన పోలీసులకు రూ.9లక్షలు నజరానా ప్రకటించినట్లు కేరళ పోలీస్ శాఖ తెలిపింది.

దీనికి సంబందించిన వివరాలను ఎమాకులం రూరల్ పోలీస్ అధికారి కే కార్తిక్ వెల్లడించారు.

జూదగాళ్ళను పట్టుకోవడంలో పోలీసులు గొప్ప నైపుణ్యం ప్రదర్శించారని, అందుకే వారిని సత్కరించనున్నామని తెలిపారు.

నగదు బహుమతిని పోలీసులందరికీ సమానంగా అందించనున్నట్లు కార్తీక్ తెలిపారు.