ఇద్దరు పిల్లల తల్లితో యువకుడి ప్రేమ.. పెద్దలు అంగీకరించరని ఇద్దరూ ఆత్మహత్య

Couple found hanging in Ghatkesar
- Advertisement -

హైదరాబాద్: ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఓ యువకుడు ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఆమెకు పెళ్లైన కూతురు ఉందన్న విచక్షణ కూడా మర్చిపోయిన ఆ యువకుడు పీకలోతు ప్రేమలో కూరుకుపోయాడు.

అయితే, తమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌‌లో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత అల్వాల్‌ సింగన్న తోటకు చెందిన మల్లేష్‌(26) ఓ ప్రైవేటు సంస్థలో కారు డ్రైవర్‌. అతడికి హైదరాబాద్‌లోని సుచిత్రలో నివాసం ఉండే కృష్ణా జిల్లా కైకలూరుకి చెందిన బాలపార్వతి(40)తో పరిచయం ఏర్పడింది.

చదవండి: ఇంటికి పిలిచి.: కామవాంఛ తీర్చలేదని మోడల్‌ను దారుణంగా హత్య చేసిన ఫొటోగ్రాఫర్

అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఓ కుమార్తెకు వివాహం కూడా అయింది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. బాలపార్వతి నుంచి భర్త దూరంగా ఉంటుండడంతో కుటుంబ పోషణ కోసం ఆమె ఇంటి సమీపంలోనే టీ కొట్టు నడుపుతోంది.

టీ తాగి ప్రేమలో పడ్డాడు…

టీ తాగేందుకు ఓసారి ఆమె టీ కొట్టుకు వెళ్లిన మల్లేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.  ఇది ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే, ఇరు కుటుంబాల వారు అందుకు ఒప్పుకోరని భావించిన పార్వతి-మల్లేశ్ పెళ్లి తర్వాత వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా అన్నోజిగూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఓ ఇల్లు అద్దెకు చూడాలంటూ మల్లేశ్ తన స్నేహితుడిని కోరాడు. అతడు ఓ ఇంటిని అద్దెకు ఇప్పించడంతో ఈ నెల 13న మల్లేష్‌-పార్వతి అక్కడికి మకాం మార్చారు. అయితే, అదే రోజున తమ కుమారుడు కనిపించడం లేదంటూ మల్లేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి: మహానటుడు: ఫేస్‌బుక్‌లో అమ్మాయిగా యువకులకు గాలమేసి.. ఆపైన ఎస్సై అవతారంలో బెదిరించి..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు 17న మల్లేశ్‌ను పిలిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయినప్పటికీ పార్వతిని వదిలి ఉండలేని మల్లేష్ 21వ తేదీన తన ద్విచక్రవాహనంపై పార్వతిని రాజీవ్‌ గృహకల్ప కాలనీకి తీసుకెళ్లాడు. అక్కడే చీరతో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -