మందుల తయారీలో సెక్స్ సంబంధిత డ్రగ్..! ప్రయోగానికి మహిళలే టార్గెట్‌?

8:54 pm, Fri, 3 May 19

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌లో మందుల తయారీలో సెక్స్‌కి సంబంధించిన కెటమైన్ డ్రగ్ వాడుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. మహిళలనే టార్గెట్‌ చేసి మందులలో ఈ డ్రగ్ కలుపుతున్న గ్యాంగ్‌ను పట్టుకుని ల్యాబ్‌ను సీజ్ చేశారు అధికారులు.

డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇటువంటి గ్యాంగునే బెంగుళూరులో పట్టుకోగా.. పట్టుబడిన వారు ఇచ్చిన సమాచారం మేరకు నాచారంలోని ‘ఇంతం’ ల్యాబ్‌లో అధికారులు సోదాలు నిర్వహించారు.

ఆ డ్రగ్ శరీరంలోకి వెళితే…

సోదాల్లో ల్యాబ్ నిర్వాహకుల అక్రమాలు బయటపడటంతో పాటు డ్రగ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెటమైన్ డ్రగ్‌ను మందుల తయారీలో ఉపయోగించడమే కాకుండా వాటిని మహిళలపై ప్రయోగిస్తున్నారు.

కెటమైన్ డ్రగ్ తీసుకున్న వ్యక్తుల్లో సెక్స్ సంబంధిత హార్మోన్లు ఉత్తేజమై మనుషుల్లా కాక మానవ మృగాల్లా ప్రవర్తిస్తారని.., ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత దాదాపు 5గంటల పాటు అపస్మారక స్థితిలోనే ఉంటారని అధికారులు వెల్లడించారు.

ఒళ్ళు గగుర్పొడిచే విషయాలను తెలుసుకున్న అధికారులు వెంటనే ల్యాబ్‌ను సీజ్ చేసి, ల్యాబ్ ఓనర్ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఇటువంటి ముఠాలు దేశం మొత్తం మీద ఇంకెన్ని ఉన్నాయో మరి..

చదవండి: రైతుల దెబ్బకి దిగోచ్చిన పెప్సీ కో.. కేసులు ఉపసంహరణ…