షాకింగ్: మాజీ మహిళా ఎస్సైపై అత్యాచారం.. షెల్టర్ హోమ్‌లో దారుణం

4:59 pm, Wed, 6 May 20
ex woman si raped in punjab

చండీగఢ్: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అదను చూసుకుని మహిళలపై దారుణాలకు పాల్పడుతూనే వస్తున్నారు. 

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షెల్టర్ హోమ్‌లో తలదాచుకున్న ఓ మాజీ మహిళా ఎస్సైపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

వివరాల్లోకి వెళితే.. బాధితురాలి భర్త రైల్వే పోలీసు. ఆయన మరణానంతరం ఆమె(50)కు కారుణ్య నియామకం కింద ఎస్ఐ పోస్టును ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

ఆలయానికి వెళ్లి తిరిగొస్తుంటే…

కొన్ని రోజుల క్రితం జమ్మూలోని వైష్ణోయ్ మాత ఆలయానికి వెళ్లిన ఆమె… తిరిగి వస్తున్న సమయంలో లాక్‌డౌన్ కారణంగా మార్గం మధ్యలో చిక్కుకుపోయారు.

ఈ  నేపథ్యంలో ఆమెను రైల్వే పోలీసులు షెల్టర్ హోమ్‌లో ఉంచారు. అక్కడ ఇద్దరు దుండగులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. జరిగిన దారుణంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.