ఢిల్లీలో దారుణం: ఫ్యాషన్‌ డిజైనర్‌ దారుణ హత్య, నమ్మి పనిలో పెట్టుకుంటే.. వాడే కాలయముడయ్యాడు!

fashion designer was killed by her own staff in delhi3
- Advertisement -

fashion designer was killed by her own staff in delhi3

న్యూఢిల్లీ: ‘‘అప్పటికి గంట నుంచి నా సోదరి నాతో ఫోన్‌లో మాట్లాడుతోంది.. నా కూతురితో మాట్లాడమన్నాను.. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు..’’ అంటూ విలపిస్తున్న ఆ మహిళను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ మాలా లఖానిని అత్యంత దారుణంగా హత్య చేశారు.

- Advertisement -

పోలీసులు కథనం ప్రకారం.. మాలా లఖాని (53) ఢిల్లీలో ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేస్తోంది. కొద్ది కాలంగా రాహుల్‌ అన్వర్‌ (24) అనే యువకుడు మాలా దగ్గర మాస్టర్‌ టైలర్‌గా పని చేస్తున్నాడు.

fashion designer was killed by her own staff in delhi1

ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ మైనర్‌ బాలికను వేధించిన కేసులో రాహుల్‌  అరెస్టు అయ్యాడు. అతడికి పూచీకత్తు కింద మాలానే డబ్బు కట్టి బెయిల్‌ ఇప్పించింది. జైలు నుండి బయటకు వచ్చిన రాహుల్‌ తిరిగి మాలా దగ్గర పనికి కుదిరాడు.

డిజైన్‌ చేసిన ‍ప్రతి డ్రెస్‌ మీద ఎక్స్‌ట్రా డబ్బులు ఇవ్వాల్సిందిగా మాలాను.. రాహుల్ డిమాండ్‌ చేసేవాడు. అయితే అందుకు మాలా నిరాకరించింది. దీంతో రాహుల్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో రాహుల్‌ మరో ఇద్దరు స్నేహితులు రాహమత్ (24), వసీమ్ (25) తో కలిసి పథకం ప్రకారం కత్తితో మాలా లఖాని గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు.  వారి దురాగతానికి అడ్డుపడిన  పని మనిషిని కూడా వాళ్ళు హత్య చేశారు. ఈ హత్య బుధవారం రాత్రి 10 – 11.30 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు.

‘‘నా సోదరి.. రాహుల్‌ని తన కొడుకుగా భావించేది. కానీ డబ్బు కోసం వాడే ఇంత దారుణానికి తెగించాడు..’’ అంటూ కన్నీరు మున్నీరు అయింది మాలా సోదరి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మాలా సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రాహులతో పాటు అతని స్నేహితులను అరెస్ట్‌ చేశారు.

- Advertisement -