షాకింగ్: హెల్మెట్‌ లేదని బైక్‌ ఆపితే.. హత్య విషయం బయటపడింది, ఎక్కడంటే…

man arrested for killed his friend in karnataka state
- Advertisement -

man arrested for killed his friend in karnataka state

బెంగళూరు: వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను ఓ యువకుడు నిర్ఘాంతపోయే విషయం చెప్పి షాక్‌కి గురి  చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

- Advertisement -

హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుకొంటూ వస్తున్న ఓ యువకుడ్ని పోలీసులు ఆపి బైక్‌ పత్రాలు చూపించమని ప్రశ్నించగా.. ‘‘నేను ఇప్పుడే నా స్నేహితుడ్నిహత్య చేసి వస్తున్నాను. నన్ను క్షమించండి..’’ అని ఆ యువకుడు తన దగ్గర ఉన్న రక్తంతో తడిసిన కత్తిని పోలీసులకు చూపించాడు. దీంతో షాక్‌ అయిన పోలీసులు వెంటనే  అతడ్ని అరెస్టు చేసి విచారణ జరపగా అతడు చేసిన దారుణం బయట పడింది.

స్నేహితుడ్ని కత్తితో పొడిచి బైక్‌పై వస్తూ…

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే సందీప్‌ శెట్టి(26) రియల్‌ ఎస్టేట్‌  వ్యాపారంలో భాగస్వామి అయిన స్నేహితుడు దేవరాజ్‌ను కత్తితో పొడిచాడు.  అతడి ద్వారా అ విషయం తెలుసుకున్న పోలీసులు సందీప్ చెప్పిన ప్రదేశానికి వెళ్ళి చూడగా.. అక్కడ దేవరాజ్‌ రక్తపు మడుగులో పడి కనిపించాడు.  అప్పటికే రక్తం ఎక్కువగా పోయి అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

‘‘రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని సందీప్‌ రెండేళ్ల క్రితం స్నేహితుడు దేవరాజ్‌కు లక్ష రూపాయలు ఇచ్చాడు. అయితే అతడు ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది.. కోపంలో దేవరాజ్‌ను సందీప్‌ కత్తితో పోడిచేశాడు.. దారిలో వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులు ఆపి అడగడంతో విషయం బయటపడింది..’’ అని ఎస్పీ తెలిపారు.

- Advertisement -