త్రీ స్టార్ హోటల్‌లో హైటెక్ సెక్స్ రాకెట్.. నటీమణులతో బలవంతంగా వ్యభిచారం…

11:37 am, Fri, 17 January 20
high-profile-sex-racket-busted

ముంబై: ఓ త్రీ స్టార్ హోటల్లో కొనసాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. సినీ, టీవీ రంగానికి చెందిన నటీమణులను మభ్యపెట్టి బెదిరించి ముంబై అంధేరీలోని ఆ స్టార్ హోటల్‌లో ఓ మహిళ ఈ సెక్స్ రాకెట్ నడుపుతోంది.

ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న సిటీ పోలీస్ సోషల్‌ సర్వీస్ బ్రాంచ్‌ తూర్పు అంధేరిలోని ఓ హోటల్‌పై గురువారం దాడులు చేపట్టింది. ఈ దాడిలో మైనర్ బాలిక సహా ముగ్గురు యువతులను పోలీసులు రక్షించారు. 

చదవండి: జూనియర్ ఆర్టిస్టులతో సెక్స్ రాకెట్.. డైరెక్టర్ అరెస్ట్!

పోలీసుల కథనం ప్రకారం.. బాలీవుడ్ సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసుకునే యువతులను ప్రియా శర్మ(29) అనే మహిళ మభ్యపెట్టి వ్యభిచారం చేయిస్తోంది. రైడ్ చేసిన సమయంలో అక్కడ విటుల వద్దకు పంపించేందుకు సిద్ధంగా ఉన్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకురాలు ప్రియా శర్మను అరెస్ట్ చేశారు.

ట్రావెల్ బిజినెస్ ముసుగులో…

నిందితురాలైన ప్రియా శర్మ కందివాలి ఈస్ట్‌ ప్రాంతంలో టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ బిజినెస్‌ నిర్వహిస్తోంది. దీంతో పాటు ఈజీ మనీ కోసం సదరు త్రీ స్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది.

చదవండి: హైదరాబాద్‌లో ‘సెక్స్ రాకెట్’.. ముంబై నుంచి యువతులను రప్పించి…

రైడ్ సందర్భంగా పోలీసులు కాపాడిన ముగ్గురు మహిళల్లో ఒకరు ఓ ప్రముఖ టీవీ చానల్‌ నిర్వహించే క్రైమ్‌ షోలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మరొక నటీమణి మరాఠీ చిత్రాల్లో, సీరియల్స్‌లో నటిస్తోంది.

ఇక మైనర్‌ బాలిక కూడా ఓ వెబ్‌ సిరీస్‌లో నటించినట్లు సమాచారం. ఈ ముగ్గురిని ప్రియా శర్మ బెదిరించి వ్యభిచార కూపంలోకి దింపినట్లు సోషల్ సర్వీస్ బ్రాంచ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సందేష్ రేవాలే తెలిపారు. ప్రియా శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: పబ్‌‌లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల దాడి.. యువతుల అరెస్ట్