ప్రశాంత్ సూసైడ్‌లో ట్విస్ట్: ప్రశాంత్ భార్యకి ప్రణయ్‌తో వివాహేతర సంబంధం, మరో ఆడియో టేపు

man commits suicide by Clashed with wife for omelette in hyderabad
- Advertisement -

hangingహైదరాబాద్: పంజాగుట్టలో మంగళవారం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన భార్య పావనిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణయ్‌తో తన భార్య వివాహేతర సంబంధం కారణంగానే మనోవేదనకు గురైన ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తేలిందని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

తన చావుకు తన భార్య కారణమని ప్రశాంత్ ‌సూసైడ్ లేఖ కూడా రాశాడు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు చివరికి ప్రశాంత్ భార్య పావనిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

చదవండి: విషాదం: భార్యతో గొడవలు, మనోవేదన.. హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న ప్రశాంత్, పావని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరిద్దరి మధ్య  ప్రణయ్ అనే మూడో వ్యక్తి కారణంగా గొడవలు  మొదలయ్యాయి. ఆమె ప్రియుడు ప్రణయ్‌తో వివాహేతర సంబంధాన్ని మానాలని భర్త ప్రశాంత్ భార్య పావనిని కోరాడు. అయినా ఆమె మాట వినకపోవడంతో వాళ్ళ ఇద్దరి మధ్య సంబంధం మాన్పించేందుకు పావనిని బెంగళూరు పంపించాడు. అయినా కానీ, ఆమె మాత్రం తన పద్ధతులను  ఏమాత్రం మార్చుకోలేదు.

దీంతో పద్ధతి మానుకోవాల్సిందిగా  ప్రశాంత్ తన భార్యతో ఫోన్లో  బతిమిలాడాడు.  పావని చాలా పరుషంగా మాట్లాడింది. గత ఏడాది డిసెంబర్ ముందు ఎలా ఉన్నావో అలానే ఉండాలని పావనిని ఆమె భర్త ప్రశాంత్ కోరాడు. 2014 డిసెంబర్ ముందు ఎలా ఉన్నామో అదే జీవితం ఇవ్వాలని ఆమె అతడిని కోరింది.  అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉందామని ప్రశాంత్  భార్య పావనిని ప్రాధేయపడ్డాడు.

ఎంత చెప్పినా ఆమె తన ప్రియుడు ప్రణయ్‌ను మాత్రం వదులుకొనేందుకు సిద్ధంగా లేకపోవడం ప్రశాంత్‌ను అమితంగా బాధించింది.  చివరికి ప్రియుడు ప్రణయ్‌ను ఒక్క మాట అన్నా కూడా పావని సహించలేకపోయేది. రెచ్చగొట్టొద్దంటూ భర్త ప్రశాంత్‌ను హెచ్చరించింది.  తాజాగా  పావని ప్రశాంత్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను పోలీసులు సేకరించారు. ఈ సంభాషణ ఆధారంగా పోలీసులు పావనిని విచారించి అరెస్ట్ చేశారు.

- Advertisement -