హైదరాబాద్‌లో ‘సెక్స్ రాకెట్’.. ముంబై నుంచి యువతులను రప్పించి…

3:24 pm, Mon, 30 December 19
sex racket busted in hyderabad

హైదరాబాద్: నగర శివారులోని ఉప్పర్‌పల్లి సన్‌రైజ్ కాలనీలో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోన్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యభిచార గృహం నిర్వాహకులు ముంబై నుంచి అందమైన యువతులను ఇక్కడికి రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు నలుగురు విటుల సహా ఆరుగురు యువతులను అరెస్టు చేశారు.

ఈ సెక్స్ రాకెట్‌కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కి చెందిన దీపక్ కొన్నేళ్లుగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో అతడు వ్యభిచార దందాను ఎంచుకున్నాడు. ఉప్పర్‌పల్లి ప్రాంతంలోని సన్‌రైజ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, ముంబై నుంచి కొంతమంది యువతులను అక్కడికి రప్పించి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

అందంగా, స్టయిల్‌గా కనిపించే అమ్మాయిలతో…

చూడగానే అందంగా, స్టయిల్‌గా కనిపించే యువతులను ఎంపిక చేసుకుని.. వారిని హైదరాబాద్‌కు రప్పించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు. రోజూ ఆ ఇంటికి పదుల సంఖ్యలో యువకులు వచ్చి పోతుండడం గమనించిన చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేశారు.

దీంతో పోలీసులు ఆ ఇంటిపై నిఘా వేసి, పక్కా సమాచారం మేరకు అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు దీపక్‌తోపాటు ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్న నలుగురు విటులను, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.