విషాదం: ఇష్టం లేని పెళ్లి చేశారని రైలు కిందపడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

5:07 pm, Tue, 5 February 19
suicide

suicide

కడప‌: ఇష్టం లేని వివాహం చేశారని మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్‌వేర్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రాజంపేట రైలు మార్గం కనుమలోపల్లె సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేలు పరిధిలోని అయ్యవారుపల్లెకు చెందిన ముసల్‌రెడ్డి రెండో కుమారుడు అన్నపురెడ్డి జనార్దన్‌ రెడ్డి (28) సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడు.

ఏడాదిన్నర క్రితం నెల్లూరుకు చెందిన ఓ మహిళతో పెద్దల సమక్షంలో వివాహం చేశారు. ఆమెను వివాహం చేసుకోవడం తనకు ఇష్టంలేదని పెద్దలకు చెప్పడంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ ఉద్యోగరీత్యా సింగపూర్‌కు వెళ్లాడు. జనవరి నెలలో బద్వేల్‌కు వచ్చాడు. అనంతరం హైదరాబాద్‌లో స్నేహితుల రూంలో ఆశ్రయం పొందాడు. అక్కడే స్నేహితులకు, సోదరునికి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు
సూస‘ైడ్‌ నోట్‌’ను రాసి, ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

స్నేహితులు కనిపెట్టడం, బద్వేల్‌లో వారి తల్లిదండ్రులకు తెలపడం, సనత్‌నగర్‌ పోలీసులు సెల్‌ఫోన్‌ టవర్‌ ఆధారంగా అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరిగి తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఇంటికి వచ్చిన జనార్దన్‌ రెడ్డి సోమవారం ఇంటిలో చెప్పకుండా కడపకు బయలుదేరి వెళ్లాడు.

కాగా, కనుమలోపల్లె సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శరీరం ఛిద్రమైంది. మృతదేహాన్ని కడప రిమ్స్‌ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. జనార్ధన్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.