ఓయో టౌన్ విల్లా హోటల్‌లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు అరెస్ట్

8:19 am, Wed, 21 August 19

హైదరాబాద్: అమీర్‌పేటలో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం దందా నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. ధరమ్‌కరణ్ రోడ్డులోని ఓయో టౌన్ విల్లా హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో నిఘా వేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి ఆ హోటల్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఆ సమయంలో వ్యభిచార దందాకు పాల్పడుతున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు యువతులు, హోటల్ మేనేజర్ ప్రేమ్‌తోపాటు రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు నాని అలియాస్ జోగేశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు అరవన్ పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.