షాకింగ్: ప్రేమించలేదని విద్యార్థినిపై కత్తితో దాడి.. కర్నూలులో ఉపాధ్యాయుడి దారుణం…

murder
- Advertisement -

murder

కర్నూలు: నేటి కాలంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. విధ్యాబుద్దులు నేర్పి విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సింది పోయి ఉపాధ్యాయులు తామే వక్రమార్గంలో నడుస్తున్నారు. గురువు అనే పదానికే కళంకం తెస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థినిని వేధించాడు. ఆమె తిరస్కరించడంతో తప్పతాగి ఆమె ఇంటికి వెళ్లి ఆ విద్యార్థినిపై కత్తితో దాడి చేసి చంపబోయాడు.  ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం..  కర్నూలు జిల్లా కేంద్రంలోని బంగారుపేటకు చెందిన ఓ యువతి ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో శంకర్ అనే వ్యక్తి హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆ యువతినిని ప్రేమ పేరుతో శంకర్ వేధిస్తున్నాడు. ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి  తీసుకొస్తున్నాడు.

తెలిస్తే గొడవలు జరుగుతాయేమో అని…

ఈ క్రమంలో ఉపాధ్యాయుడు శంకర్ వేధింపులు భరించలేని ఆ విద్యార్థిని.. మద్యలోనే చదువు ఆపేద్దామని నిర్ణయించుకుంది. అయితే  ఆమె కుటుంబ సభ్యులు చదువు మానవద్దంటూ ఒత్తిడి తీసుకురావడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలకు వెళ్తోంది. శంకర్ విషయం తమ కుటుంబ సభ్యులకు తెలిస్తే ఎలాంటి గొడవలు జరుగుతాయో అన్న భయంతో విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా అతడు పెట్టే బాధను భరిస్తూ వస్తుంది.

కత్తితో దాడి…

అయితే శనివారం ఉదయం ఉపాధ్యాయుడు శంకర్ పీకలవరకు తాగి ఆ విద్యార్థిని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడంతో అదే అదనుగా తనను ప్రేమించాలంటూ ఒత్తడి చేశాడు.  ఆమె ససేమిరా అనడంతో విచక్షణ కోల్పోయి తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ విద్యార్థిని అతడ్ని  ప్రతిఘటించి గట్టిగా అరవడంతో స్థానికులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు.

ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి…

కానీ అప్పటికే ఆ విద్యార్థిని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. స్థానికులను చూసి ఆందోళన చెందిన ఉపాధ్యాయుడు శంకర్.. తను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. అయినా అతడు చేసిన దారుణానికి ఆగ్రహించిన ప్రజలు అతన్ని పట్టుకుని కరెంట్ స్థంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం అతడిని పోలీసులకు పట్టించారు.

శంకర్ చేతిలో తీవ్రగాయపడిన విద్యార్థినిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆత్మహత్యాయత్నం చేసిన ఉపాధ్యాయుడు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -