ఉన్నావ్‌లో మరో దారుణం: ‘అన్నా.. వదిలేయండి..’ అని బతిమాలినా కనికరించని కామాంధులు

woman-molestation
- Advertisement -

woman-molestation

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ మరో దారుణం చోటుచేసుకుంది.  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ కేసును మరువక ముందే అదే ప్రాంతంలో ఓ మహిళపై గుర్తుతెలియని యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.  గంగాఘాట్‌ గ్రామానికి చెందిన ఆ మహిళ ఇంట్లో ఉండగా నలుగురు యువకులు ప్రవేశించి ఆమెను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. తనను వదిలేయాల్సిందిగా ఆమె వారి కాళ్లపై పడి ప్రాధేయపడినప్పటికీ వారు కనికరించలేదు సరికదా… ఆమెను చెప్పులతో కొట్టారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు.

- Advertisement -

అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాక ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడగా, మరో యువకుడు ఆ దారుణాన్ని వీడియో తీశాడు.  తమకు సహకరించకపోతే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తామని ఆ కామాంధులు ఆమెను బెదిరించారు. ఈ ఘారానికి పాల్పడే సమయంలో ఆ యువకులు తమ మొహాలను కూడా కప్పుకోలేదంటే వారెంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు.

అరిస్తే చెప్పుతో కొడతామంటూ…

‘గట్టిగా అరిస్తే చెప్పుతో కొడతామని బెదిరించటం…’ దానికి  ఆ మహిళ ‘అన్నా.. వదిలేయండి..’ అని ఆర్తనాదాలు చేస్తూ వేడుకున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అయినా కామాంధులు కనికరించలేదు.  చివరికి ఆ మహిళ ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు.

ఇద్దరి అరెస్టు, మరో ఇద్దరి కోసం గాలింపు…

ఈ దారుణానికి పాల్ఆపడిన వారిలో రాహుల్, ఆకాష్ అనే ఇద్దరిని అరెస్టు చేసి, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అలాగే ఆ వీడియో ఎక్కడి నుంచి సోషల్ మీడియాలోకి అప్‌లోడ్ అయ్యిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  అత్యాచారాలకు ఉత్తర్ ప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. గత నెలలో ఉన్నావ్‌లోనే ఓ తొమ్మిదేళ్ల చిన్నారిపై పాతికేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే అదే జిల్లాలో ఇప్పుడు ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.

గతంలోనూ…

గత ఏప్రిల్‌లో ఓ అమ్మాయి(16) తనపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తొమ్మిది నెలలుగా బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా అమ్మాయి తండ్రిని చితకబాదడంతో కొన్నిరోజులుకు ఆయన మృతిచెందాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆ తరువాత పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.

 

- Advertisement -