దారుణం: మందులు కొనడానికి వస్తే బెదిరించి.. తల్లి ఎదుటే కూతుర్ని…

8:56 pm, Tue, 16 April 19
muzaffarnagar-gang-rape-in-front-of-mother

లక్నో: ఉత్తర్‌ప్రదే‌శ్‌లో దారుణం చోటు చేసుకొంది. ఇద్దరు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ ఆమె కన్నతల్లి చూస్తుండగానే. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జిల్లా కాక్రౌలి ప్రాంతానికి చెందిన యువతి(22) మందులు కొనుక్కునేందుకు తల్లితో కలిసి బజారుకు వచ్చింది. ఆమె మందుల దుకాణం వద్ద మందులు తీసుకునే సమయంలో ఇద్దరు యువకులు వచ్చి వారిని బెదిరించి సమీపంలోని చెరకు తోటలోనికి తీసుకెళ్లారు.

తల్లిని బంధించి ఆమె ఎదురుగానే కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దని, చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారు. ఇంటికి వచ్చిన తరువాత జరిగిన ఘోరాన్ని బాధితురాలు తన తండ్రికి చెప్పింది. దీంతో ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.