షాకింగ్: మద్యం మత్తులో.. సొంత చెల్లెలిపైనే.. అన్నఅత్యాచారం, తండ్రి నిద్రపోగానే…

Youth Drunk And Rapes His Sister On Diwali night In Gurgam Haryana
- Advertisement -

Youth Drunk And Rapes His Sister On Diwali night In Gurgam Haryana

గుడ్‌గావ్: దీపావళి పండుగ రోజున తండ్రితో కలిసి మద్యం తాగిన ఓ యువకుడు.. తండ్రి నిద్రించిన తర్వాత తన తోడబుట్టిన సొదరిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హర్యానాలోని గుడ్‌గావ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దారుణానికి తెగబడిన యువకుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

పోలీసుల కథనం ప్రకారం… హర్యానా రాష్ట్రం గుడ్‌గావ్  జిల్లాలోని ఫరూక్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. అతడి భార్య మతిస్థిమితం కోల్పోయి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం దీపావళి పండగ సందర్భంగా అందరూ కలిసి ఆనందంగా తమ ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం ఆ వ్యక్తి తన కుమారుడితో కలిసి మద్యం తాగాడు.

ఆ సమయంలో అతని ముగ్గురు కుమార్తెలలో ఇద్దరు కుమార్తెలు ఒక గదిలో నిద్రించగా.. మూడో కుమార్తె మాత్రం మరో గదిలో నిద్రించింది. తండ్రితో కలిసి మద్యం సేవించిన తర్వాత కొడుకు తన గదిలో వెళ్లి పడుకున్నాడు. ఆర్ధరాత్రి సమయంలో తండ్రి గాఢ నిద్రలో ఉన్నాడని నిర్ధారించుకున్న ఆ యువకుడు తన చెల్లి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు.

మరుసటి రోజు ఉదయం బాధిత యువతి ఈ విషయన్ని తన తండ్రికి తెలియజేసింది. దీంతో వెంటనే.. ఆయన తన కుమార్తెను తీసుకుని పోలీసు స్టేషన్‌కి వెళ్లి తన కొడుకు అఘాయిత్యం గురించి చెప్పి ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కొడుకును అరెస్టు చేశారు.  బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చదవండి: షాకింగ్: బాలికను బెదిరిస్తూ.. నాలుగేళ్లుగా వసతి గృహం సూపరింటెండెంట్‌ కీచకపర్వం
చదవండి: ఘోరం: అటవీశాఖ వెదురు డిపోలో యువతి మృతదేహం! హత్యకు ముందు అత్యాచారం.. ప్రియుడిపైనే పోలీసుల అనుమానం

- Advertisement -