ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే…

2:05 pm, Sat, 13 April 19
ap-inter-advance-supplementary-exams-2019

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసింది. ఇటీవల విడుదలైన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 14 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చు.

దీనికి సంబంధించి ఏప్రిల్ 24లోగా ఆయా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరేవారు ఏప్రిల్ 22లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్టియర్ విద్యార్థుల్లో 60 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. సెకండియర్ విద్యార్థులు 72 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఏపీలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా 3.3 లక్షల మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యారు.

ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులకు మే 14 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 14 నుంచి 22 వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.

ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ap-inter-supplementary-exam-schedule-2019