తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి

10:58 pm, Sun, 24 May 20
Emcet and other Entrance Exams schedule was released by Telangana State Council of Higher Education

హైదరాబాద్: తెలంగాణలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(రాష్ట్ర ఉన్నత విద్యా మండలి) విడుదల చేసింది. 

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ గతంలో ఉన్నత విద్యా మండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు.

జూలై 1న పాలిసెట్, జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్, జూలై 4న ఈసెట్, జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జూలై 10న లాసెట్, పీజీ ఎల్‌సెట్, జూలై 13న ఐసెట్, జూలై 15న ఎడ్‌సెట్ నిర్వహిస్తారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సూచించిన అన్ని నిబంధనలకు అనుగుణంగానే ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది.