ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

10:33 am, Thu, 18 April 19
telangana inter result

తెలంగాణ: తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఇంటర్‌ ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నారు.

మొదటి, ద్వితీయ, ఒకేషనల్‌ ఫలితాలు ఒకేసారి ..

ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ చేసింది. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దనరెడ్డి ఫలితాలను విడదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు.

ఫలితాల కోసం tsbie services అనే మొబైల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని తెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే www.pratibha.net తో పాటు tsbie.cgg.gov.in,.. bie.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.