తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

- Advertisement -

తెలంగాణలో తొలిసారి ఓ కరోనా పేషెంట్ మరణించారు. బాధితుడు హైదరాబాద్‌ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వృద్ధుడు. మార్చి 14న ఢిల్లీ వెళ్లిన ఈ వృద్ధుడు ఆ తరువాత మూడు రోజులకే హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. 

ఆ తరువాత జలుబు, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందితో గ్లోబల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ విషయం తెలియగానే ప్రభుత్వ వైద్యశాఖ అధికారులు ఆ వృద్ధుడి మృతదేహాన్ని ప్రైవేటు ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పోస్టుమార్టం నిర్వహించగా, ఆ వృద్ధుడు కరోనా వైరస్ కారణంగానే మరణించినట్లు తేలింది. దీంతో ఆ వృద్ధుడి మృతదేహానికి సోమవారం ఉదయం ఖైరతాబాద్‌లోని స్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.

- Advertisement -