రేవంత్ నా శిష్యుడే…..చంద్రబాబు మా పార్టీ పేరుతో నకిలీ అభ్యర్ధులని ఎన్నికల బరిలో దించారు: కేఏ పాల్

9:15 pm, Tue, 7 May 19

హైదరాబాద్: ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 38 నియోజకవర్గాల్లో తమ పార్టీ పేరుతో నకిలీ అభ్యర్థులను బరిలోకి దింపారని ఆరోపించారు.

నర్సాపురం ఎంపీ సెగ్మెంట్‌లో ఈవీఎంలు పనిచేయకుండా ప్రభుత్వం కుట్రపన్నిందని, వైసీపీకి అనుకూలంగా చేసేందుకు ప్రభుత్వం ఈ పని చేసిందన్నారు.

ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం అంతగా ఏమీ ఉండదని, ఆ పార్టీ రెండు మూడు శాతం ఓట్లు సాధిస్తోందని ఆయన జోస్యం చెప్పారు.

ఎన్నికల్లో రష్యా జోక్యం

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని, ఈ విషయాన్ని సీఐఏ కూడ ధృవీకరించిందని తెలిపారు. ఈ సమాచారం తనకు ఈరోజే తెలిసిందని, అయితే ఈ విషయాన్ని రాతపూర్వకంగా నివేదిక ఇవ్వాలని తాను సీఐఏను కోరినట్టుగా చెప్పారు.

చదవండి: చంద్రబాబుకి వెన్నుపోటు పొడించింది వారేనా!?

రేవంత్ నా శిష్యుడే…

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని, రేవంత్ రెడ్డి అడిగితే క్షణాల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని, తాను అడిగితే కనీస స్పందన కూడా ఉండదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, అయినా ఎవరూ స్పందించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

చదవండి: ఎవరితోనైనా పెట్టుకోండి.. నాతో కాదు: కేటీఆర్‌కి కేఏ పాల్ వార్నింగ్!