రవి, టీవీ9తో నేనున్నా: టీవీ9 రవిప్రకాశ్‌కి కేఏ పాల్ మద్దతు

11:59 am, Fri, 10 May 19

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా టీవీ9-అలందా మీడియా సంస్థల మధ్య  వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. అలందా మీడియా కార్యదర్శి కౌశిక్ రావు సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రవిప్రకాశ్‌ని టీవీ9 సీఈఓ పదవినుండి తొలగించారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై రవి ప్రకాష్ స్వయంగా స్పందించి వాటిని ఖండించారు. తానే టీవీ9 సి‌ఈ‌ఓ అని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టీవీ 9 సీఈఓ రవిప్రకాశ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు ప్రకటించారు.

చదవండిటీవీ9 సీఈ‌వో పదవి నుంచి తొలగింపు వార్తలపై స్పందించిన రవి ప్రకాశ్…

తాజాగా ఓ వీడియో పోస్ట్‌లో ఆయన మాట్లాడుతూ….. 2007 నుంచి రవిప్రకాశ్ తనకు తెలుసని, సీఈఓ పదవి నుంచి ఆయన్ని తప్పించారన్న వార్తలు విని షాకయ్యానని చెప్పారు. ఇక రవి ప్రకాశ్ పై ఒత్తిడి చేసి సీఈఓ పదవి నుంచి ఆయన్ని ఎవరైనా తప్పించాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

రవిప్రకాశ్ తో, టీవీ 9కి అండగా తాను ఉన్నానని వ్యాఖ్యానించారు. ఇక టీవీ 9 యాజమాన్యానికి రవిప్రకాశ్‌కు మధ్య ఏవైనా గొడవలుంటే వాటి పరిష్కారానికి అవసరమైతే తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.

చదవండి: కేఏ పాల్‌కు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి