మండలి రద్దు తీర్మానంపై తీవ్రంగా స్పందించిన పవన్

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే ఏకంగా మండలి రద్దు చేయడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలి రద్దుతో రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని కోల్పోయినట్లేనని జనసేనాని అన్నారు. శాసనమండలి రద్దు సరైన చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసన మండలి పునరుద్ధరించారని, జగన్ ఇప్పుడు మండలి రద్దు చేయడం సరైంది కాదని అన్నారు.

చదవండి: పనిలో పనిగా అసెంబ్లీని కూడా రద్దు చేయండి: చంద్రబాబు

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మండలి రద్దు సరైన చర్య కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే వ్యవస్థలను తొలిగించుకుంటూ పోవడం పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అసలు శాసనమండలికి ప్రజామోదం ఉందా? లేదా? అనే అంశాన్ని పరిగణంలోకి తీసుకోవాలన్నారు.

రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని, అసెంబ్లీలో ఏదైనా నిర్ణయం సరికాదని అనిపించినప్పుడు మండలిలో దానిపై చర్చ జరుగుతుందని, తప్పులు గమనిస్తే తెలియజేస్తుందన్నారు. పెద్దల సభలో మేథోపరమైన ఆశయం కోసం మండలి ఏర్పాటైందని పవన్ అన్నారు.

- Advertisement -