ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: కేంద్ర మంత్రులను కోరిన జగన్

- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన ఏపీ ముుఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.

ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి అమరావతి-అనంతపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని, కొత్త రహదారుల నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు. జగన్ అభ్యర్థనకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

రాష్ట్రపతితో జగన్ భేటీ…

మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన జగన్ బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించిన జగన్.. ఆయనకు శ్రీవేంకటేశ్వ స్వామి జ్ఞాపికను అందజేశారు.

అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సమావేశమైన జగన్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.వెంకయ్యనాయుడు కూడా సానుకూలంగా స్పందించారు.

జగన్ వెంట వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -