అద్భుతం: దేవుడు ఉన్నాడు అనడానికి ఇలాంటి సంఘటనలే ఆధారం!

2:46 pm, Fri, 19 April 19
sun-rays-fallen-on-a-temple

అరసవెల్లి: ఏకత్వంలో భిన్నత్వంగా ఉండే మన భారతదేశంలో పూర్వం కాలం నుంచి దేవుడిని పూజించడం ఆచారంగా వస్తోంది . మన దేశంలో విగ్రహాలను, రాళ్లను సైతం దేవుడిగా కొలుస్తుంటారు.

ఈ విషయంలో ఎవరికి ఉండే అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే హేతువాదులు దీనిని పిచ్చి చర్యగా అభివర్ణించినప్పటికి భక్తులు మాత్రం తమ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోలేదు.

దేశంలో అత్యధిక సంపాదన శ్రీవారిదే…

భారత దేశంలో భక్తుల ద్వారా వచ్చే కానుకలే అత్యధికం అని ఓ సర్వేలో తెలిందటే అర్థం చేసుకోవాలి, భారతీయులకు దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో. భారతదేశంలో సగటున రోజుకి ఎక్కువ సంపాదించేది ఎవరో తెలుసా?

ఇంకెవరు.. మన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడే. తిరుమల స్వామి సంపాదన రోజుకి కోటీ రూపాయిలకు పైనే ఉంటుందని అంచనా.

కేవలం ఆ గుడిపైనే అలా…

ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదండి.. దేవుడిని ఎక్కువగా నమ్మే మన దేశంలో మరో అద్బుతం జరిగింది. ఆకాశం నుంచి సరిగ్గా సూర్య కిరణాలు ఓ దేవుడి గుడిపై పడటం కనిపించింది. 

సూర్యుడు నుంచి వచ్చిన సూర్య కిరణాలు నిట్టనిలువునా కేవలం ఆ గుడిపై మాత్రమే పడ్డాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలు ఇది దేవుడి మహిమే అని నమ్ముతున్నారు.

ఈ దృశాల్ని అక్కడ కొందరు తమ సెల్‌ఫోన్స్‌లో బంధించారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియడం లేదు. కొందరు ఇది కేరళలో జరిగిందని అని అంటున్నారు, మరి కొందరు తమిళనాడులో అని ప్రచారం చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి సూర్యకిరణాలు ఇలా కేవలం గుడిపై మాత్రమే పడటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.