టీఆర్ఎస్ అఖండ విజయంపై కేటీఆర్ స్పందన.. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్

5:10 pm, Tue, 11 December 18
telangana election victory ktr tells thanks to people on twitter

telangana election victory ktr tells thanks to people on twitter

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రసమితి సాధించిన అఖండ విజయంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్.. ‘‘కేసీఆర్ గారిపై నమ్మకం ఉంచి మరోసారి ప్రజాసేవ చేసేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు..’’ అని ట్వీట్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ మేరకు కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ.. ‘శుభాకాంక్షలు.. రానున్న ఐదు సంవత్సరాల పాలన సజావుగా సాగాలి..’ అంటూ తన అభినందనలు తెలియజేశారు.