ఏపీలో నేడు ఒక్క రోజే కరోనాతో 10 మంది మృతి.. 605 కేసులు నమోదు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా‌ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి రాష్ట్రంలో ఒక్కరోజే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, కృష్ణ జిల్లాలో నలుగురు చొప్పున, గుంటూరులో ఒకరు, విశాఖలో మరొకరు కరోనా కాటుకు బలయ్యారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 605 కేసులు నమోదు కావడం ఆందోళకు గురిచేస్తోంది.

రాష్ట్రానికి చెందిన 570 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మందికి , విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11,489 మంది కరోనా బారినపడగా, 6,147 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, తాజా మరణాలతో కలుపుని రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 146 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

ఇధి కూడా చదవండి: తెలంగాణలో భయపెడుతున్న కరోనా కేసులు

- Advertisement -