ఏపీలో ఒక్కరోజులో 10,418 కొత్త కేసులు.. 4,634కు చేరిన మొత్తం మరణాలు…

3:22 pm, Thu, 10 September 20

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 10,418 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారిన పడి మరో 74 మంది మరణించారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 5,27,512కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,634కు చేరింది.

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా 43 లక్షలు దాటాయి. బుధవారం ఉదయం 9 గంటల సమయానికి 43,08,762 టెస్టులు జరిగినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక బులెటిన్‌లో వెల్లడించింది.

మిలియన్‌ జనాభాకు 80,688 టెస్టులు చేస్తూ దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. బుధవారం ఒక్కరోజే 71,692 టెస్టులు నిర్వహించారు. మరోవైపు బుధవారం. 9,842 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,25,607 మంది కోలుకోగా, ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 97,271 మంది చికిత్స పొందుతున్నారు.