38 ఏళ్లుగా టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు..అందరికి ధన్యవాదాలు

11:02 am, Fri, 29 March 19
TDP Latest News, 38 Years TDP News, Chandrababu Naidu News, Newsxpressonline

హైదరాబాద్: నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఆదేశించారు. వాడవాడలా తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్య ఘనంగా జరపాలని సూచించారు. ఎన్టీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. టీడీపీని గత 38 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్న ప్రతీఒక్కరికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, కార్యకర్తలు, సేవామిత్రలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం…

గత 38 ఏళ్లుగా ఏ పార్టీకీ దక్కని గౌరవం టీడీపికి దక్కిందని చంద్రబాబు తెలిపారు. నిరంతంర ప్రజల్లోనే ఉండి తాము ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని సీఎం చెప్పారు. టీడీపీకి ప్రజలే తొలి ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు.

సకల జనుల సంక్షేమ,సౌభాగ్యమే తమ లక్ష్యమన్నారు. అన్నివర్గాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హమీ ఇచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడుతామనీ, అందరినీ ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుపుతామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన పాలన అందిస్తామన్నారు.